News December 22, 2025
బిగ్ బాస్ విన్నర్ మన ఉత్తరాంధ్ర కుర్రాడే..!

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌లో కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇతనిది భోగాపురం మండలం సుందరపేట. భారత ఆర్మీలో పని చేసిన కళ్యాణ్, బిగ్ బాస్ షోలో కామనర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల ఆదరణ పొంది విజేతగా నిలిచారు. కాగా కళ్యాణ్ తల్లిదండ్రులు పాన్‌షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన కళ్యాణ్ విజేతగా నిలవడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News December 22, 2025
అమెరికాలో నల్గొండ యువకుడి మృతి

నల్గొండ మండలం మేళ్ల దుప్పలపల్లికి చెందిన పవన్ రెడ్డి శనివారం తెల్లవారుజామున అమెరికాలో మృతి చెందాడు. బీటెక్ పూర్తి చేసిన పవన్ ఎంఎస్ చదివేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. మిత్రులతో కలిసి పార్టీలో పాల్గొన్న అతను అకస్మాత్తుగా చనిపోయాడు. పోస్టుమార్టం అనంతరం మరింత సమాచారం తెలిసే అవకాశముంది. ఉద్యోగానికి ఎంపికయ్యాడని, ఇంతలో ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
News December 22, 2025
యూరియాను కౌలు రైతులు ఎలా బుక్ చేయాలి?

TG: కౌలు రైతులు యూరియా పొందాలంటే Fertilizer Booking App డౌన్‌లోడ్ చేసుకొని ఫోన్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి. తర్వాత పట్టాదారు పాస్‌పుస్తకం నెంబర్ ఆప్షన్‌లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, యాప్‌లో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయాలి. తర్వాత యాప్‌లో కనిపించే వివరాలను నింపాలి. బుకింగ్ కోడ్ రాగానే కేటాయించిన సమయంలో డీలర్ వద్దకు వెళ్లి బుకింగ్ ఐడీ చూపించి, డబ్బు చెల్లిస్తే రైతుకు యూరియా ఇస్తారు.
News December 22, 2025
APPLY NOW: NTPCలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

<


