News October 24, 2025

బిచ్కుంద: చెరువులో మృతదేహం

image

బిచ్కుంద మండలం బండారెంజల్ గ్రామ చెరువులో శుక్రవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నీటిలో శవం తేలియాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడిని అదే గ్రామానికి చెందిన చాకలి సంతోశ్‌గా గుర్తించారు. మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 24, 2025

గోదావరిఖని: జాగృతి సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సదానందం

image

తెలంగాణ జాగృతి సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గోదావరిఖనికి చెందిన అందె సదానందం నియమితులయ్యారు. తెలంగాణ జాగృతిలో పలు పదవులకు పలువురిని నియమిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జాగృతి రాష్ట్ర సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అందె సదానందంను నియమించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితకు సదానందం కృతజ్ఞతలు తెలిపారు.

News October 24, 2025

సమ్మె విరమిస్తున్నాం: వైద్య సంఘాలు వెల్లడి

image

AP: తమ డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టమైన హామీలు ఇచ్చినందున సమ్మెను విరమిస్తున్నట్లు పీహెచ్సీ, ఏపీవీవీపీ వైద్యుల సంఘం నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఆయన్ను కలిసి మాట్లాడారు. పీజీ మెడికల్ ఇన్ సర్వీసు కోటాను 20%, 2026–27లో 15% కోటాను సాగించేందుకు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. గతంలో అమల్లో ఉండి నిలిచిన DNB కోర్సుల్లో ప్రవేశాలు, తదితర విషయాల్లోనూ మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.

News October 24, 2025

గజ్వేల్: ‘డీసీసీబీ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి’

image

DCCB బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కోరారు. గజ్వేల్‌లో నూతన DCCB బ్యాంకు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.2,800 కోట్ల టర్నోవర్‌తో 49 బ్యాంకులు, 105 ఫాక్స్ ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డీసీసీబీలో మిగతా బ్యాంకులతో పోల్చితే రూ.50 పైసలు అధిక వడ్డీ ఇస్తామన్నారు.