News March 26, 2025

బిజినేపల్లి: ఈనెల 27న ఉద్యోగమేళా

image

బిజినేపల్లి మండల పరిధి పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27వ తేదీన ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఉ:10 గంటల నుంచి జాబ్ మేళా ఉంటుందని, జిల్లాలోని 10వ తరగతి ఇంటర్, డిగ్రీ, డిప్లమా పాసైన 33 ఏళ్లలోపు వయసున్న యువతి, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 13, 2025

జరిమానా వేసే జీహెచ్ఎంసీకి కూడా జరిమానా

image

చెత్త, వ్యర్థాల నిర్వహణపై దుకాణదారులు, ప్రజలకు జరిమానా వేసే జీహెచ్ఎంసీకి కూడా జరిమానా పడింది. వేస్ట్ మేనేజ్‌మెంట్ సరిగా పాటించడం లేదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. జీహెచ్ఎంసీకి రూ.లక్ష ఫైన్ విధించింది. సిటీలో ఉత్పత్తి అయ్యే చెత్తను ఇష్టానుసారంగా జవహర్‌నగర్‌లో డంపింగ్ చేస్తున్నారంటూ పలువురు ఎన్జీటీని ఆశ్రయించగా ఈ చర్యలు తీసుకొంది. చెత్త నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించింది.

News November 13, 2025

దుగ్గిరాల పసుపు యార్డులో ధరలు ఇలా..!

image

దుగ్గిరాల యార్డు పసుపుకు పెట్టింది పేరు. అయితే పసుపు యార్డులో ధరలు బుధవారం జరిగిన వేలంలో ఈ విధంగా నమోదయ్యాయి. కొమ్ములు క్వింటాకు కనిష్ఠ ధర రూ.10,800, గరిష్ఠ ధర రూ.13,000, మోడల్ ధర రూ.12,550 పలికాయి. కాయ క్వింటాల్‌కు కనిష్ఠ ధర రూ.11,200, గరిష్ఠ ధర రూ.13,000, మోడల్ ధర రూ.11,800 పలకగా, మొత్తం 308 బస్తాల పసుపును రైతులు వ్యాపారులకు విక్రయించారని సిబ్బంది చెప్పారు.

News November 13, 2025

తొలితరం సంపాదకులు మన పండితారాధ్యుల నాగేశ్వరరావు

image

తొలితరం సంపాదకులైన పండితారాధ్యుల నాగేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా ఇంటూరులో జన్మించారు. గుంటూరులోని AC కళాశాలలో విద్యాభ్యాసం చేసిన ఆయన, పిఠాపురం మహారాజావారి దేశబంధు పత్రికలో కొన్నాళ్లు, ఆచార్య రంగా నెలకొల్పిన వాహిని పత్రికలో1932లో చేరారు. 1943-1959 ఆంధ్రపత్రికలో, 1960లో ఆంధ్రభూమిలో,1965లో ఆంధ్రజనతకు, 1966 నుంచి 1976 మరణించే వరకూ ఆంధ్రప్రభ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు. నేడు ఆయన వర్ధంతి