News January 24, 2026
బిడ్డను నరబలి ఇచ్చిన తల్లికి ఉరిశిక్ష రద్దు!

TG: 2021లో సూర్యాపేట జిల్లాలో మూఢనమ్మకంతో 7 నెలల పసికందును నరబలి ఇచ్చిన కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితురాలు బానోత్ భారతికి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఘటన సమయంలో భారతి తీవ్రమైన మానసిక అనారోగ్యంతో ఉందని, ఏం చేస్తుందో కూడా తెలియని స్థితిలో ఉన్నందున నేరం వర్తించదని స్పష్టం చేసింది. ఆమెను తక్షణమే మానసిక చికిత్స కేంద్రానికి తరలించాలని ఆదేశించింది.
Similar News
News February 11, 2026
మనస్సును ప్రశాంతంగా మార్చే భైరవీ ముద్ర

సుఖాసనంలో కానీ పద్మాసనం/వజ్రాసనంలో కూర్చోవాలి. నడుం వంగకుండా నిటారుగా ఉండేలా చూడాలి. రెండు చేతులను ఒళ్లో ఉంచి ఒక అరచేతిలో ఇంకో అరచేయి పెట్టి ఉంచాలి. కుడి చేయి పైన , ఎడమ చేయి కింద ఉండేవిధంగా చూసుకోవాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాసతీసుకుని వదులుతూ శ్వాసమీద ధ్యాసను ఉంచాలి. కనీసం 7నిమిషాల సమయం ఈ భైరవి ముద్రలో ఉంటే మనస్సు ప్రశాతంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
News February 11, 2026
మొక్కజొన్నను ఆశించే తెగుళ్లు – నివారణ

మొక్కజొన్న నాటిన 30 రోజుల దశలో పేనుబంక ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ml, ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. నల్లులు ఆశించకుండా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నల్లులు ఆశిస్తే లీటరు నీటిలో డైకోఫాల్ 50mlను కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1ml వేప నూనెను 5 గ్రాముల సబ్బుపొడిలో కలిపి పిచికారీ చేయాలి.
News February 11, 2026
నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

AP: నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉ.10.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. 11.30 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 14న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 FYకి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ సమావేశాల నుంచి తొలిసారిగా డిజిటల్ అటెండెన్స్ విధానం ప్రవేశపెట్టనున్నారు.


