News March 17, 2026
బిల్లులో గ్యాస్ ఛార్జ్.. రూల్స్ ఏం చెబుతున్నాయి?

హోటల్ బిల్లులో ఫుడ్ ప్రైస్, GST తప్ప మరే ఇతర ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదని వినియోగదారుల రక్షణ చట్టం (2019) చెబుతోంది. ఇటీవల ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సర్వీస్ ఛార్జ్ అయినా, మరే ఇతర పేరుతో అయినా కస్టమర్ అనుమతి లేకుండా ఎక్స్‌ట్రా డబ్బులు అడగొద్దు. పెరిగిన ఖర్చులను మెనూ ధరల్లో చూపించాలే తప్ప విడిగా యాడ్ చేయడం రూల్స్‌కు విరుద్ధం.
Similar News
News April 5, 2026
NZB: నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలి: కవిత

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం అందించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB మాజీ MP కవిత ఆదివారం X వేదికగా డిమాండ్ చేశారు. వడగళ్ల వాన బోధన్ నియోజకవర్గ రైతులకు కన్నీటిని మిగిల్చిందని సాలూర, ఖాజాపూర్, హున్సా, మందర్నా గ్రామాల్లో వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి రైతులకు భరోసా ఇవ్వాలన్నారు.
News April 5, 2026
కోర్టు అన్ని వర్గాల ప్రజలకు పవిత్ర స్థలం: సీఎం రేవంత్

TG: కొత్త హైకోర్టు నిర్మాణాన్ని ప్రారంభించడం తమ ప్రభుత్వానికి ఓ గొప్ప అవకాశమని CM రేవంత్ చెప్పారు. అగ్రశ్రేణి న్యాయ మేధావులతో కలిసి ఉండటం తనకు లభించిన గౌరవమన్నారు. హైకోర్టు జోన్-2 శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కోర్టు సముదాయం నిర్మించడం అంటే అన్ని కులాలు, మతాల ప్రజలకు న్యాయం కోసం ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటుచేసినట్లే. ఈ భవనం మా ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం’ అని పేర్కొన్నారు.
News April 5, 2026
కార్పొరేట్ FDతో అధిక వడ్డీ.. కానీ జాగ్రత్త!

సాధారణ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే కార్పొరేట్ FDలు 1-2% అదనపు వడ్డీని ఆఫర్ చేస్తాయి. అయితే ఇందులో రిస్క్ అధికంగా ఉంటుంది. సదరు సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడితే అసలు, వడ్డీ చెల్లింపుల్లో జాప్యం లేదా ఎగవేసే ప్రమాదం ఉంది. ఎలాంటి ఇన్సూరెన్స్ ఉండదు. అందుకే పెట్టుబడి పెట్టే ముందు CRISIL, ICRA వంటి సంస్థలు ఇచ్చే క్రెడిట్ రేటింగ్స్‌ను తప్పక పరిశీలించాలి. అధిక రేటింగ్ ఉన్న సంస్థల్లో భద్రత ఎక్కువ.


