News February 8, 2026

బిల్లుల స్వీపింగ్: GHMCలో దోపిడీ!

image

నగర రోడ్లు క్లీన్ అవుతున్నాయో లేదో గానీ బడాబాబుల జేబులు ఫుల్ అవుతున్నాయి!. మెకానికల్ స్వీపింగ్ మెషీన్ల పేరుతో నెలకు రూ.కోట్ల ప్రజాధనం పక్కదారి పడుతోంది. అసలు 30 మెషీన్లు షెడ్డు దాటకుండానే GPS డేటాను ట్యాంపర్ చేసి బిల్లులు దండుకుంటున్నారు. ఇది GHMC ఇంటర్నల్ విచారణలో తేలినట్లు టాక్. నెలకు రూ. 12 కోట్ల బడ్జెట్‌లో సింహభాగం కాంట్రాక్టర్లు, అధికారుల పాలవుతున్నట్లు GHMC బాస్ దృష్టికి వచ్చినట్లు సమాచారం.

Similar News

News February 11, 2026

RR: GREAT ఓటేసిన 103 ఏళ్ల రామయ్య

image

మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 103 ఏళ్ల రామయ్య తన ఓటు హక్కును వినియోగించుకుని యువకులకు ఆదర్శంగా నిలిచారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్‌కి చెందిన రామయ్య అదే వార్డులోని పోలింగ్ కేంద్రానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వీల్ ఛైర్‌పై వచ్చి తన వార్డుకు చెందిన తన ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. ఓటు విలువ ఇప్పటికైన కొందరు తెలుసుకోవాలని సూచించారు.

News February 11, 2026

HYD: మారిన రూపురేఖలు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే!

image

నాడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి జీహెచ్ఎంసీకి నేడు 300 డివిజన్లతో భారీ విస్తరణ వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అప్పుడు సీఎంగా వైఎస్ఆర్ నేడు రేవంత్ రెడ్డి హయాంలో మార్పులు జరిగాయి. ఈ 12 ఏళ్ల కాలంలో మహానగరంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మెట్రో రైలు, బహుళ అంతస్తుల భవనాలు, ఫ్లై ఓవర్లు.. ఇలా అనేకం నగర ప్రతిష్ఠను ఇనుమడింపజేశాయి.

News February 11, 2026

HYD: భారీగా వాహనాల వేలం..!

image

వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను త్వరలో వేలం వేయనున్నట్లు సైబరాబాద్ ఎంటీఓ-2 వీరలింగం తెలిపారు. దాదాపు 304 వాహనాలు పట్టుబడ్డాయని.. వీటిని ఆన్‌లైన్ ద్వారా వేలంలో విక్రయిస్తామని వివరించారు. అయితే ఈ వాహనాల యజమానులు తమ యాజమాన్య వివరాలకు సంబంధించి డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు వారికి స్వాధీనం చేస్తామని తెలిపారు. వివరాలకు 8712663357 నంబరులో ఫోన్ చేయాలన్నారు.