News December 26, 2025
బిల్లు కన్నా ఎక్కువ తీసుకుంటే చర్యలు: జేసీ

వంట గ్యాస్ డెలివరీ సమయంలో ఛార్జీల పేరుతో వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ హెచ్చరించారు. శుక్రవారం మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ, రేషన్ సరుకుల పంపిణీపై అధికారులతో సమీక్షించారు. వంట గ్యాస్ అందించే డెలివరీ బాయ్స్ ప్రతి వినియోగదారునితో మర్యాదగా ప్రవర్తించేలా డీలర్లు పర్యవేక్షించాలని, రసీదు కంటే ఒక్కరూపాయి డిమాండ్ చేసినా, వసూలు చేసినా చర్యలు తప్పవన్నారు.
Similar News
News December 30, 2025
అలా సందుల్లో దూరడం విజ్ఞత అనిపించుకోదు.. సజ్జనార్ స్వీట్ వార్నింగ్

TG: న్యూ ఇయర్ వేడుకల వేళ యువతకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. చౌరస్తాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయనే భయంతో సందుల్లో దూరి, ప్రమాదకరంగా వాహనాలు నడపడం విజ్ఞత అనిపించుకోదని స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడపడం మృత్యువును ఆహ్వానించడమేనని, ఒకవేళ యముడు వదిలేసినా చట్టం వదలదన్నారు. ‘మీ ప్రాణం విలువ మాకు తెలుసు. కాబట్టే ఈ హెచ్చరిక’ అని ట్వీట్ చేశారు.
News December 30, 2025
అవార్డ్ అందుకున్న ధర్మారం యువకుడు

ధర్మారం మండలానికి చెందిన కోలిపాక కుమారస్వామి తన జీరో బడ్జెట్‌తో “కళాకారుడు” అనే షార్ట్ ఫిల్మ్‌ని నిర్మించి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్-2025 అవార్డు అందుకున్నారు. 3 నిమిషాల చిత్రాన్ని 15 రోజుల్లో పూర్తిచేసి 500కుపైగా చిన్న సినిమాలను పోటీలో అధిగమించారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, TGFDC ఛైర్మన్ దిల్ రాజు, దర్శకుడు హరీశ్ శంకర్ తదితరులు కుమారస్వామిని అభినందించారు.
News December 30, 2025
భువనగిరి జిల్లా తొలి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్

యాదాద్రి భువనగిరి జిల్లా తొలి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ నియమితులయ్యారు. ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ పరిధిలోని కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రాచకొండ పరిధిలోని భువనగిరి జోన్‌ను ప్రత్యేక పోలీస్ జిల్లాగా గుర్తిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న అక్షాంశ్ యాదవ్‌నే ప్రభుత్వం జిల్లా ఎస్పీగా నియమించింది.


