News February 17, 2026

బిల్ గేట్స్ టూర్.. SMలో తీవ్ర విమర్శలు!

image

మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నిన్న <<19155078>>అమరావతి<<>>లో పర్యటించడం తెలిసిందే. అయితే ఆయన భారత టూర్‌పై SMలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో గేట్స్ పేరు చాలా సార్లు ఉండటమే ఇందుకు కారణం. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న అలాంటి వ్యక్తితో ఎవరూ భేటీ కాకూడదని MP కాంగ్రెస్ నేత అనూప్ ధోటే ట్వీట్ చేశారు. తన ఉత్పత్తుల కోసం ఇండియాను ల్యాబ్‌లా ఆయన చూస్తారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

Similar News

News February 17, 2026

‘ఇందాపూర్’ పేరిట ‘హెరిటేజ్’ దోపిడీ: బొత్స

image

AP: TTD లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని CBN దుష్ప్రచారం చేశారని, సిట్ నివేదికతో ఆయన దుర్బుద్ధి బయటపడిందని YCP నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ‘కల్తీ వల్ల ఇందాపూర్ సంస్థను బ్లాక్‌లో పెడితే ఇప్పుడు అదే సంస్థ నుంచి KG నెయ్యి ₹680కి TTD కొంటోంది. ఆ సంస్థను అడ్డుపెట్టుకొని ‘‘హెరిటేజ్’’ ఈ దోపిడీ ప్లాన్ చేసింది. ఏఐ సమ్మిట్ నుంచి బిల్ గేట్స్‌ను కేంద్రం తప్పించగా AP ఆహ్వానించడం ఏమిటి’ అని ప్రశ్నించారు.

News February 17, 2026

రోడ్లు శుభ్రంగా లేకుంటే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తా: CM

image

TG: మున్సిపల్ అధికారులు, కమిషనర్లపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ‘త్వరలో GHMCలోని ప్రతి జోన్‌లో పర్యటిస్తా. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తా. కమిషనర్లు, జోనల్ కమిషనర్‌లు పొద్దునే ఫీల్డ్‌లో ఉండాలి. చాలా మంది వెళ్లట్లేదు. అలాంటి అధికారులపై వేటు వేస్తా’ అని మున్సిపల్ శాఖ సమీక్షలో హెచ్చరించారు. GHMC 3 కార్పొరేషన్లలో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

News February 17, 2026

నటికి చేదు అనుభవం.. వాష్‌రూమ్‌లో వీడియో తీసి బ్లాక్‌మెయిల్

image

ఓ కన్నడ టీవీ నటికి చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని ఓ ఇండోర్ స్టేడియంలో ఈవెంట్‌కు హాజరవగా అక్కడి వాష్‌రూమ్‌లో ఓ వ్యక్తి ఆమె వీడియోను రహస్యంగా చిత్రీకరించాడు. దానిని ఇన్‌స్టాలో పంపి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.