News January 20, 2025

బిహార్‌కు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ RRR

image

ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బిహార్ వెళ్లారు. ఆ రాష్ట్రంలో జరిగిన అఖిల భారత సభాపతుల మహాసభలో పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇతర రాష్ట్రాల స్పీకర్లతో కలిసి ఆయన సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్ల విధులు గురించి తెలుసుకున్నారు.

Similar News

News February 2, 2026

పశ్చిమ గోదావరికి బడ్జెట్‌ బూస్ట్

image

కేంద్ర బడ్జెట్‌లో ఉమ్మడి పశ్చిమ గోదావరికి పలు కేటాయింపులు జరిగాయి. పోలవరం ప్రాజెక్టుకు రూ.3,200 కోట్ల సాయం, జిల్లా ఆసుపత్రుల్లో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు నిధులు దక్కాయి. కోకో, కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏలూరు, భీమవరంలో బాలికల హాస్టళ్లు, నరసాపురం క్రోచెట్ లేస్ తయారు చేసే మహిళల కోసం ‘షి’ మార్కెట్లు రానున్నాయి.

News February 2, 2026

గొల్లలకోడేరు కాదు.. భీమవరం రండి

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని కార్యాలయానికి బదులుగా ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరగనుంది. ప్రజలు ఈ మార్పును గమనించి, నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి తమ విన్నపాలను అందజేయాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.

News February 2, 2026

గొల్లలకోడేరు కాదు.. భీమవరం వన్‌టౌన్‌కు రండి