News November 11, 2025

బిహార్ తుది దశ పోలింగ్‌కు సిద్ధం

image

బిహార్‌లో తుది దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 జిల్లాల్లోని 122 స్థానాలకు ఉ.7-సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. బరిలో 1,302 మంది అభ్యర్థులు ఉన్నారు. తొలి దశలో రికార్డు స్థాయిలో 65.08శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అదే కంటిన్యూ అవుతుందా అని ఆసక్తి నెలకొంది. రెండు దశల్లో కలిపి ఈ నెల 14న అధికారులు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు.

Similar News

News February 25, 2026

ఇండియా ఓడినందుకు రవిశాస్త్రి హ్యాపీ.. ఎందుకంటే?

image

T20 WC: సౌతాఫ్రికా చేతిలో భారత్ భారీ తేడాతో ఓడిపోవడంపై రవిశాస్త్రి స్పందించారు. వరుస విజయాల తర్వాత ఇలాంటి ఓటమి ఎదురుకావడం సహజమని, ఇది టీమ్‌కు మేల్కొలుపు లాంటిదని అభిప్రాయపడ్డారు. సెమీఫైనల్స్ వంటి కీలక దశలో కాకుండా ఇప్పుడే ఓటమి ఎదురైనందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఓటమి వల్ల జట్టు తన వ్యూహాలను, ప్లేయింగ్ ఎలెవన్‌ను రివ్యూ చేసుకొని పుంజుకునే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

News February 25, 2026

24 గంటలూ స్పీడ్ పోస్ట్ బుకింగ్

image

AP: ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 11 నగరాల్లో 24 గంటలూ స్పీడ్ పోస్ట్, పార్సిల్ బుకింగ్ సేవలను అందించనుంది. ఆ జాబితాలో విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి, ఒంగోలు, గుంతకల్ ఉన్నాయి. అలాగే మరో 242 పట్టణాల్లో సబ్ పోస్టాఫీస్‌ల పనివేళలను రెండు గంటలు పెంచింది.

News February 25, 2026

ముఖాన్ని మెరిపించే బ్యూటీ టిప్స్

image

* కలువ పూరేకలు, తేనె, పాలు కలిపి పేస్ట్ చేసి ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేసుకుంటే ముడతలు, మచ్చలూ తగ్గుతాయి. * గులాబీ రేకల ముద్దకు కాసిన్ని పాలు, చెంచా సెనగపిండి కలిపి ముఖానికి, మెడకు రాయండి. పావుగంట ఆరనిచ్చి కడిగితే ముఖం మెరిసిపోతుంది. * మల్లెలను పేస్టు చేసి, అందులో కొబ్బరినూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి పావుగంట సేపు మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.