News July 16, 2024
బి.కోడూరు: పాఠశాల స్థలాన్ని తనఖా పెట్టారు: టీడీపీ

మండల పరిధిలోని గోవిందాయపల్లె జిల్లా ఉన్నత పాఠశాలను వైసీపీ నాయకులు ఆన్‌లైన్లో నమోదు చేసుకుని రుణాలు పొందారని మండల టీడీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర రైతు కార్యదర్శి రమణారెడ్డి ఆరోపించారు. వారు మాట్లాడుతూ.. గోవిందాయ పల్లె జిల్లా ఉన్నత పాఠశాల 40 ఏళ్ల నుంచి అక్కడ ఉందన్నారు. 4.27 సెంట్లు భూమిని కొండ వెంకటసుబ్బమ్మ పేరిట ఆన్‌లైన్లో నమోదు చేసుకున్నారని విమర్శించారు.
Similar News
News November 2, 2025
విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్ కు కాల్ చేయండి.!

ప్రతి సోమవారం విద్యుత్ సమస్యలపై డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని మొట్టమొదటగా నిర్వహించనున్నట్లు సంస్థ ఛైర్మన్ శివశంకర్ లోతేటి తెలిపారు. ఇందులో భాగంగా రాయలసీమ జిల్లా వాసులు ఉదయం 10-12 గంటల మధ్య 89777 16661 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను వివరించవచ్చన్నారు.
News November 2, 2025
ప్రొద్దుటూరు: అక్టోబర్‌లో రూ.65.07 కోట్ల మద్యం విక్రయం

గత నెలలో ప్రొద్దుటూరు IMFL డిపోలో రూ.65.07 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. బద్వేల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రూ.10.28 కోట్లు, జమ్మలమడుగు రూ.7.30 కోట్లు, ముద్దనూరు రూ.3.58 కోట్లు, మైదుకూరు రూ.8.77 కోట్లు, ప్రొద్దుటూరు రూ.16.65 కోట్లు, పులివెందుల రూ.11.22 కోట్లు, ఎర్రగుంట్లలో రూ.7.23 కోట్ల మద్యం విక్రయించారు. 91,291 కేసుల IML మద్యం, 39,902 కేసుల బీరు విక్రయించినట్లు చెప్పారు.
News November 2, 2025
ప్రొద్దుటూరు: గతనెలలో రూ.65.07 కోట్ల మద్యం విక్రయం