News May 30, 2024
బి.కోడూరు: YCP నాయకుడిపై కేసు నమోదు

మండలంలోని పెద్దులపల్లెకి చెందిన EX ZPTC, YCP నాయకుడు రామకృష్ణారెడ్డిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దులపల్లె పరిధిలోని ప్రభుత్వ భూమి S.NO:331లో 10 ఎకరాలను ఆక్రమించాడని పలు ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు భూములను పరిశీలించి నోటీసులు ఇచ్చారు. ఆక్రమిత భూమిలో రాత్రికి రాత్రే మొక్కలు నాటడంతో గుర్తించిన MRO మహేశ్వరి బాయ్ సిబ్బందితో మొక్కలను తొలగించారు. MRO ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
Similar News
News September 11, 2025
ఎర్రగుడిపాడులో రైలులో నుంచి పడి యువకుడి మృతి

ఎర్రగుంట్ల – ఎర్రగుడిపాడు మధ్య రైలులో నుంచి కింద పడి అరవిందు (21) మృతి చెందినట్లు ఎర్రగుంట రైల్వే ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. యువకుడు తమిళనాడులోని కాంచీపురం వాసిగా గుర్తించారు.
News September 11, 2025
ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ గ్రౌండ్ బకాయిల వివరాలు

ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేలంపై కౌన్సిల్ సమావేశంలో 24 గంటలు ఉత్కంఠత అనంతరం ఆమోదం తెలిపారు. 9 ఏళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు మున్సిపాలిటీకి బకాయిలు పెడుతూనే ఉన్నారు. వాటి వివరాలు (లక్షలలో)..
2015లో రూ.3.96, 2016లో రూ.3.13, 2017లో రూ.2, 2018లో రూ.4.75, 2019లో రూ.8.02, 2021లో రూ.7.10, 2022లో రూ.30.06, 2023లో రూ.5.66, 2024లో రూ.31.50 బకాయిలు మున్సిపాలిటీకి రావాల్సి ఉంది.
News September 11, 2025
ప్రొద్దుటూరు: రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

ప్రొద్దుటూరు జార్జ్ కారొనేషన్ క్లబ్లో బుధవారం ఎస్జీఎఫ్ఐ జిల్లా స్థాయి అండర్ 14, 17 బాల బాలికల ఫెన్సింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభను చూపిన 40 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాజుపాలెం ఎంఈవో ప్రసాద్, హెచ్ఎం ఇమామ్ హుస్సేన్, పీడీలు పోటీలను పర్యవేక్షించారు.