News March 13, 2025

బీఆర్ఎస్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: సీతక్క

image

తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను నువ్వు అని సంబోధించడం వారి అహంకారానికి నిదర్శనం అన్నారు. స్పీకర్ దళితుడు కాబట్టే అగౌరవ పరుస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ అంటే గౌరవం లేదని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News March 14, 2025

హనుమకొండ: ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ 

image

హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ పి.ప్రావిణ్య జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు. 

News March 14, 2025

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు: హ‌రీశ్‌రావు

image

రాష్ట్ర అసెంబ్లీ చ‌రిత్ర‌లో ఈరోజు ఒక చీక‌టి రోజు అని సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేసిన అనంత‌రం నెక్లెస్ రోడ్డులోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌ను ప్రతిపాదించినప్పుడు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు.

News March 14, 2025

హోళీ పండుగపై కడప ఎస్పీ సూచనలు

image

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ హోళీ పండుగ శుభాకాంక్షలతో పాటు పలు సూచనలు చేశారు. హోలీ పండుగను సురక్షితంగా జరుపుకోవాలన్నారు. అన్ని మతాలవారు మతసామరస్యం పాటిస్తూ ఎదుటివారి మనోభావాలను గౌరవిస్తూ బాధ్యతతో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా హద్దులు దాటితే ఉపేక్షించమని, ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా సురక్షితంగా పండుగ జరుపుకోవాలని అన్నారు.

error: Content is protected !!