News March 13, 2026
బీఆర్ఎస్‌పై సిరిసిల్ల ‘తెలుగు తమ్ముళ్ల’ ఆగ్రహం

లోకసభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, సిరిసిల్ల నేతన్న చౌక్ వద్ద బీఆర్ఎస్ నాయకులు టీడీపీ ఎంపీల ఫ్లెక్సీలను దహనం చేయడాన్ని సిరిసిల్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఇది అత్యంత దుర్మార్గమైన, పిరికిపందల చర్య అని వారు అభివర్ణించారు.
Similar News
News April 5, 2026
యూనివర్సిటీలో మావోయిస్టు భావజాలం: బండి సంజయ్‌కు విద్యార్థుల ఫిర్యాదు

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తూ, విద్యార్థులను మావోయిస్టు భావజాలం వైపు ప్రేరేపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పరిశోధక విద్యార్థి నైతం మహేశ్ కేంద్రమంత్రి బండి సంజయ్‌కు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్ సుజాత, విద్యార్థి కరికే మహేశ్‌పై గతంలోని అభియోగాలను పేర్కొంటూ, వారి వల్ల తనకు ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
News April 5, 2026
కోర్టు అన్ని వర్గాల ప్రజలకు పవిత్ర స్థలం: సీఎం రేవంత్

TG: కొత్త హైకోర్టు నిర్మాణాన్ని ప్రారంభించడం తమ ప్రభుత్వానికి ఓ గొప్ప అవకాశమని CM రేవంత్ చెప్పారు. అగ్రశ్రేణి న్యాయ మేధావులతో కలిసి ఉండటం తనకు లభించిన గౌరవమన్నారు. హైకోర్టు జోన్-2 శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కోర్టు సముదాయం నిర్మించడం అంటే అన్ని కులాలు, మతాల ప్రజలకు న్యాయం కోసం ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటుచేసినట్లే. ఈ భవనం మా ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం’ అని పేర్కొన్నారు.
News April 5, 2026
మెట్రో రెండో దశ విస్తరణపై అనిశ్చితి !

హైదరాబాద్ మెట్రో రెండోదశ విస్తరణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు పార్లమెంట్‌లో కేంద్రం సమాధానం ఇచ్చింది. రెండో దశ విస్తరణకు సంబంధించి ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేసింది. అలాగే మెట్రో ఫేస్-1 స్వాధీనంపై ప్రభుత్వానికి సూచనలు మాత్రమే చేశామని పేర్కొంది. దీంతో అసలు మెట్రో రెండోదశ ఎప్పుడు పూర్తవుందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


