News March 25, 2024

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌‌వి అబద్ధపు ప్రచారాలు

image

నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారన్నారు. నల్గొండలో శనివారం ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ 6 పథకాలు అమలు చేయలేదు. వంద రోజుల్లో వంద రూపాయల పని కూడా జరగలేదు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన రోజునే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు.

Similar News

News April 8, 2026

నల్గొండ: మూగ జీవాలను హింసిస్తున్నారా..!

image

నల్గొండ జిల్లాలో వీధి కుక్కల పట్ల అమానవీయంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పశువైద్యాధికారి డాక్ట‌ర్ జి.వి.రమేశ్ హెచ్చరించారు. ఇటీవల శునకాలను హింసించడం, చంపడం వంటి ఘటనలు వెలుగులోకి రావడంతో ఆయన స్పందించారు. జంతు సంరక్షణ చట్టం-1960 ప్రకారం మూగజీవాలను హింసించడం నేరమని గుర్తుచేశారు. ప్రజలు జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించవద్దని, చట్టపరమైన ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు.

News April 7, 2026

నల్గొండలో 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

నల్గొండ జిల్లాలో ఈ నెల 20 నుంచి మే 5 వరకు పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO బిక్షపతి తెలిపారు. థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు, ప్రాక్టికల్స్ ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు జరుగుతాయని తెలిపారు. మొత్తం 3,837 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. దేవరకొండ, మిర్యాలగూడ, నల్గొండల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News April 7, 2026

NLG: ప్రశాంతంగా జీవశాస్త్రం పరీక్ష.. 41 మంది గైర్హాజరు

image

జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన జీవశాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ బిక్షపతి తెలిపారు. మొత్తం 106 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు సాధారణ విద్యార్థులు 19,698 మందికి గానూ 19,663 మంది హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 103 మందికి గానూ 97 మంది రాశారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 41 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన వివరించారు.