News November 1, 2025

బీఆర్ఎస్ పార్టీలో నాకు అవమానం జరిగింది: కవిత

image

బీఆర్ఎస్ పార్టీలో నాకు అవమానం జరిగింది.. అందుకే బయటకు వచ్చానని కరీంనగర్‌లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌లో ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తనను కలిచి వేసిందని, ఉద్యమకారులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బంది పడుతున్నారన్నారు. పార్టీపై పూర్తిస్థాయిలో నిర్ణయాలు తీసుకొని మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపారు.

Similar News

News November 1, 2025

ADB: మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించిన MP నగేశ్

image

మాజీ మంత్రి, MLA తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ శనివారం హరీష్ రావు నివాసంలో శనివారం పరామర్శించారు. సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

News November 1, 2025

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం కలకలం

image

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం(22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న లేక్ సిబ్బంది డెడ్‌బాడీని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.