News February 8, 2026
బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒక్కటే: మంత్రి అడ్లూరి

రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కై రాజకీయం చేస్తున్నాయని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆ 2 పార్టీలకు ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి పెద్దపీట వేసిందని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
Similar News
News February 9, 2026
కామారెడ్డి: ఎన్నికల మెటీరియల్ పంపిణీకి రంగం సిద్ధం

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులకు మంగళవారం ఉదయం ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నట్లు నోడల్ ఆఫీసర్ రాజు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కోసం ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర పోలింగ్ ఆఫీసర్లుగా ఎంపికైన సిబ్బంది తమకు కేటాయించిన సంబంధిత డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్దకు చేరుకోవాలని సూచించారు.
News February 9, 2026
భూపాలపల్లిలో 13వ తేదీ వరకు సైలెన్స్ డే: ఎస్పీ

భూపాలపల్లిలో సోమవారం సా.5 గంటల నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు సైలెన్స్ డేగా పరిగణిస్తామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. స్థానికేతరులు, ఓటర్లు కానివారు వెంటనే ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని భూపాలపల్లిలో సంచరించరాదని సూచించారు. ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులతో ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు వేయాలన్నారు.
News February 9, 2026
కామారెడ్డి: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్

కామారెడ్డిలోని పీఆర్టీయూ భవన్‌లో సోమవారం రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. PRTU సంఘం ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ సమాజానికి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.


