News April 17, 2025
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి: మాజీ మంత్రి

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తిలో ఈనెల 27వ తేదీన జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.
Similar News
News January 11, 2026
చర్మానికి స్క్రబ్ ఎందుకు చెయ్యాలంటే?

పని ఒత్తిడిలో పడి చాలామంది చర్మ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. దీంతో మృతకణాలు చేరి చర్మం నిర్జీవంగా మారుతుంది. అందుకే వీలు దొరికినప్పుడు శరీరం మొత్తానికి అంటే వీపు, మెడ, కాళ్లకు స్క్రబ్బింగ్ చేస్తే మంచిదంటున్నారు నిపుణులు. దీనికోసం బాత్‌సాల్ట్, డీప్ క్లెన్సింగ్ మిల్క్ వాడొచ్చు. లేదంటే గులాబీరేకల ముద్దలో తేనె, పాలు, ఉలవపిండి కలిపి చర్మానికి పట్టించి స్క్రబ్ చెయ్యాలి. దీనివల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి.
News January 11, 2026
ఇకపై ప్రతివారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు: భట్టి

TG: ఇకపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతి వారం నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్ధిదారులు వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని రామగుండం పర్యటనలో అన్నారు. స్థానికంగా 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటివరకు నిధుల లభ్యతను బట్టి సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
News January 11, 2026
విశాఖ పోలీసుల పనితీరును ప్రశంసించిన సీఎం

విశాఖలో ఓ మహిళపై జరిగిన దాడిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులను సీఎం చంద్రబాబు అభినందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారని సీఎం కొనియాడారు. విశాఖలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమన్నారు. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదన్నారు.


