News February 25, 2025

బీఆర్ఎస్ స్కాంలన్నీ సీబీఐకి అప్పగించండి: బండి సంజయ్

image

ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని సీఎం రేవంత్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పైకి తిడుతున్నట్లుగా నటిస్తూ కేసీఆర్ కుటుంబంతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు స్కాంలపై మాట్లాడిన వాఖ్యలు చూస్తే ఆయన సీఎంగా ఉన్నారా? లేక మేము ఉన్నామా? అనే అనుమానం వస్తుందన్నారు. బీఆర్ఎస్ స్కాంలను సిబిఐకి అప్పగించాలనన్నారు.

Similar News

News November 22, 2025

పౌరాణిక, జానపద పాత్రలు నా డ్రీమ్ రోల్స్: రాజీవ్ కనకాల

image

పౌరాణిక, జానపద పాత్రలు పోషించాలన్నదే తన అభిలాష అని సినీ నటుడు రాజీవ్ కనకాల చెప్పారు. పెదపట్నంలంకలో సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన శనివారం మాట్లాడుతూ.. 225 చిత్రాల్లో నటించానన్నారు. స్టూడెంట్ నెంబర్-1తో పాటు పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. విశ్వంభర, ఆంధ్రా కింగ్, చాయ్‌వాల, తెరచాప, మహేంద్రగిరి, వారాహి విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, డ్రాగన్ చిత్రం జనవరిలో ప్రారంభమవుతుందన్నారు.

News November 22, 2025

‘వారణాసి’ బడ్జెట్ రూ.1,300 కోట్లు?

image

రాజమౌళి-మహేశ్‌బాబు కాంబోలో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ బడ్జెట్ దాదాపు ₹1,300Cr ఉండొచ్చని నేషనల్ మీడియా వెల్లడించింది. ఇప్పటివరకు రూపొందిన భారీ బడ్జెట్ భారతీయ చిత్రాల్లో ఇది ఒకటని తెలిపింది. అయితే నితీశ్ తివారి-రణ్‌వీర్ కపూర్ ‘రామాయణం’, అట్లీ-అల్లు అర్జున్ ‘AA22xA6’ మూవీల బడ్జెట్(₹1500Cr-₹2000Cr రేంజ్‌) కంటే ఇది తక్కువేనని పేర్కొంది. కాగా బడ్జెట్‌పై వారణాసి మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

News November 22, 2025

నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: ఎంపీ కడియం కావ్య

image

వరంగల్ నగర అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు అందరి సహకారంతో నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ కడియం కావ్య అన్నారు. ఉనికిచర్లలో ఆమె మాట్లాడుతూ.. నగర అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఎయిర్‌పోర్ట్, కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్‌టైల్ పార్క్, స్పోర్ట్స్ స్కూల్స్‌తో పాటు అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వంటి పనులకు రూ.4 వేల కోట్లు మంజూరు చేశారని చెప్పారు.