News April 25, 2024
బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా కామేశ్ నామినేషన్

ఖమ్మం బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా కొత్తగూడెం పట్టణానికి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి గౌతమ్ కు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కామేష్ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో 90% పైగా ఉన్న బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ పనిచేస్తుందన్నారు. అన్ని పార్టీలు అగ్రవర్ణాలకు టికెట్ ఇస్తుందని, బీఎస్పీ మాత్రమే జనరల్ స్థానాల్లో బీసీ ఎస్సీలకు ఇస్తుందన్నారు.
Similar News
News July 9, 2025
రాష్ట్ర వ్యాప్తంగా 8.81 లక్షల దరఖాస్తులు: పొంగులేటి

గత ప్రభుత్వంలో రైతులను కష్టపెట్టిన ధరణిని తొలగించి భూభారతి తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 8.81 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. రైతుల భూ సమస్యలు పరిష్కరించి సంపూర్ణ హక్కులు కల్పిస్తామన్నారు. న్యాయస్థానం విచారణలో ఉన్నవి మినహా అన్నింటికీ పరిష్కారం చూపుతామని పొంగులేటి పేర్కొన్నారు.
News July 9, 2025
బాల పురస్కార్ అవార్డుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

2025-26 ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి తెలిపారు. అసాధారణ ప్రతిభాపాటవాలు, ఆటలు, కళలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలలో అవార్డులను అందిస్తామని తెలిపారు. ఈ నెల 31లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కాఫీలను కలెక్టరేట్ మహిళా శిశు సంక్షేమ శాఖలో అందించాలని తెలిపారు.
News July 9, 2025
ఖమ్మం జిల్లాలో తగ్గిన ఎంపీటీసీ స్థానాలు

ఖమ్మం జిల్లాలో MPTCల సంఖ్య తేలింది. గత ఎన్నికల్లో 289 స్థానాలుండగా ప్రస్తుతం 284కు తగ్గాయి. జిల్లాలో కల్లూరు, ఎదులాపురం మున్సిపాలిటీలుగా ఏర్పడటంతో సంఖ్య తగ్గింది. కల్లూరులో 5 స్థానాలు తగ్గటంతో 13 స్థానాలతో అధికారులు డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో కల్లూరులో 18 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. అటు ఎదులాపురంలోని గ్రామాలన్నీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రావటంతో పెద్దగా MPTCల సంఖ్య మారలేదు.