News April 2, 2024
బీచుపల్లి: కృష్ణానదిలో నీరు తగ్గడంతో చేపల మృత్యువాత
ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వేడి తీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటే మరో పక్క కృష్ణానదిలోని చిన్నచిన్న నీటి మడుగుల్లో నీరు తగ్గి పోవడంతో చేపలు చనిపోతున్నాయి. బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణాలోని గుర్రంగడ్డ, నిజాంకొండ తదితర ప్రాంతాల్లోని నీటి మడుగుల్లో చేపలు మృత్యువాత పడుతున్నాయి. కృష్ణా పరిసరాలు, చెరువుల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 25, 2024
MBNR: BJP కొత్త సారథులు ఎవరు?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. మరి MBNR, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి.
News December 25, 2024
MBNR: మెదలైన ఎన్నికల సందడి.. యువత ఓటు ఎటు?
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లలో యువత ఓటును ఆకర్షించడానికి నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సారి యువత ఓటు అధిక సంఖ్యలో నమోదు కావడంతో స్థానిక నాయకులలో భయం మొదలైంది. యువత మాత్రం అభివృద్ధి వైపే ఓటు వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటర్లను ప్రలోభ పెట్టేలా నాయకులు ప్రవర్తిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
News December 24, 2024
MBNR: అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వినతి
మహబూబ్‌నగర్ పట్టణంలోని డీసీసీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, ఒబేదుల కోత్వాల్, మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.