News April 24, 2025
బీచ్ కబడ్డీకి ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల ఎంపిక

కాకినాడలో మే 2 నుంచి 4 వరకు జరిగే అంతర్ జిల్లా బీచ్ కబడ్డీ పోటీలకు ఉమ్మడి గుంటూరు జిల్లా పురుషులు, మహిళల జట్లు ఎంపికయ్యాయి. గురువారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన సెలెక్షన్స్‌లో 9 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఎంపికయ్యారు. అనంతరం ఇండియా క్యాంప్‌నకు ఎంపికైన గోపీచంద్‌ను సన్మానించారు. కబడ్డీ సంఘ నాయకులు, కోచ్‌లు, పీడీలు పాల్గొన్నారు.
Similar News
News April 25, 2025
పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆ దేశంపై భారత ఉమెన్స్ బేస్‌బాల్ టీమ్ అదరగొట్టింది. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో 2-1 తేడాతో ఘన విజయం సాధించింది.
News April 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 25, 2025
యాదాద్రి క్షేత్రంలో నేడు చండీ హోమం

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండీహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.