News September 6, 2025
బీచ్ క్రీడా పోటీలు అంబరాన్ని అంటాలి: బాపట్ల కలెక్టర్

దక్షిణ భారత స్థాయిలో బీచ్ క్రీడా పోటీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఫ్లడ్ లైట్ల మధ్య వాలీబాల్, కోకో, బాక్సింగ్, ఫెన్సింగ్ వంటి క్రీడా పోటీలు భారీ స్థాయిలో నిర్వహించాలన్నారు.
Similar News
News September 6, 2025
SRD: పిల్లలను చంపేదుకు చేతులెలా వచ్చాయి తల్లీ !

సంగారెడ్డి(D) నిజాంపేటలో <<17625700>>ఇద్దరు పిల్లలను చంపి తల్లి<<>> ఉరేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దామరచెరువుకు చెందిన సంగమేశ్వర్‌తో ప్రేమలకు మూడున్నరేళ్ల క్రితం పెళ్లైంది. రెండు రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె నిన్న ఈ దారుణానికి పాల్పడింది. ‘భరించలేని కష్టమొచ్చిన సరేనమ్మా.. పిల్లలను చంపేదుకు చేతులెలా వచ్చాయి తల్లీ’ అని బంధువులు, గ్రామస్థులు కన్నీటి పర్యాంతమయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 6, 2025
కాసేపట్లో KCRతో హరీశ్‌రావు భేటీ!

TG: BRS నేత, మాజీమంత్రి హరీశ్ రావు లండన్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం KCRతో హరీశ్ రావు భేటీ కానున్నారు. కవిత ఆరోపణలపై ఆయన కేసీఆర్‌తో చర్చించే అవకాశముంది. కవితను సస్పెండ్ చేయడంతో పార్టీ హరీశ్‌రావు వైపే ఉందని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కవిత, విపక్షాల విమర్శలు, కాళేశ్వరం నివేదిక అంశంపైనా వీరి మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
News September 6, 2025
ఇక IT ఎగుమతులపైనా US టారిఫ్స్?

భారత వస్తువులపై 50% టారిఫ్స్ వేస్తున్న US త్వరలో IT సేవలపైనా ట్యాక్స్ విధించొచ్చని తెలుస్తోంది. INDలోని చాలా IT కంపెనీలు USకు ఔట్‌సోర్సింగ్ సేవలందిస్తున్నాయి. వస్తువుల్లాగే లాగే సేవలపైనా TAX చెల్లించాలని US మాజీ నేవీ ఆఫీసర్ ట్వీట్ చేశారు. దీన్ని ట్రంప్ అడ్వైజర్ నవరో రీపోస్ట్ చేయడంతో భారత IT కంపెనీల్లో ఆందోళన మొదలైంది. దీనిని అమెరికన్ టెక్ వర్కర్స్ స్వాగతిస్తుండగా ఇండియన్ టెకీస్ ఖండిస్తున్నారు.