News November 11, 2025
బీజాపూర్ అడవుల్లో ఎన్‌కౌంటర్..!

ఛత్తీస్‌గఢ్ సరిహద్దు బీజాపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు పోలీస్ బలగాలు చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మావోయిస్టుల్లో కొంతమంది అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 11, 2025
GWL: నిందితుడి నుంచి రూ.2,33,500 స్వాధీనం

గద్వాల శేరెల్లి వీధికి చెందిన బలిజ లక్ష్మి హత్య కేసు వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం మీడియాకు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి రూ.2,33,500 నగదు, ఐఫోన్,TS 33-C-5838 నంబరు గల స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ అలవాటు పడి రామిరెడ్డి అనే వ్యక్తి ఈ నెల 2న బలిజ లక్ష్మీని హత్య చేసి ఆమె మెడలోని బంగారం దొంగిలించాడన్నారు. ముద్దాయిని రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు.
News November 11, 2025
మెదక్: ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్ నగేష్ కొనియాడారు. కలెక్టరేట్‌లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆజాద్ జయంతి వేడుక నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్, అధికారులు, సిబ్బంది ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు నగేష్ తెలిపారు.
News November 11, 2025
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించిన కవిత

జాగృతి ‘జనం బాట’లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మంగళవారం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం ప్రజలు తమ భూములను పెద్ద మనసుతో ఇచ్చారని కొనియాడారు. 2015లోనే ఈ ప్రాజెక్ట్ త్వరగా పూర్తయి ఉంటే ప్రస్తుత సమస్యలు ఉండేవి కావని ఆమె అభిప్రాయపడ్డారు.


