News February 23, 2025

బీజేపీ అభ్యర్థులను గెలిపించండి : ADB MP

image

ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు చిన్నమయల్ అంజిరెడ్డి, కొమురయ్యను గెలిపించాలని ADB ఎంపీ గోడెం నగేష్ అన్నారు. శనివారం మామడ మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు రంజిత్ కుమార్, నాయకులు చందు, నారాయణ రెడ్డి, బాపురెడ్డి, రాజారెడ్డి, నవీన్, గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.

Similar News

News February 23, 2025

గ్రూప్-2 వివాదంలో ఎవరి పాత్ర ఎంతంటే?: ఎమ్మెల్సీ చిరంజీవి

image

AP: గ్రూప్-2 వివాదంలో జగన్ పాత్రే అధికంగా ఉందని టీడీపీ MLC చిరంజీవి ఆరోపించారు. నోటిఫికేషన్ రావడం, రోస్టర్‌లో తప్పులు, హైకోర్టులో కేసులు జగన్ హయాంలోనే జరిగాయని దుయ్యబట్టారు. మెయిన్స్ FEB 23న పెట్టాలని హైకోర్టు సూచిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశముందని వాయిదా వేయాలని CBN కోరినట్లు తెలిపారు. పరీక్ష వాయిదాతో టీడీపీకి లబ్ధి అని YCP ఫిర్యాదు చేయగా రద్దు కుదరదని APPSC తేల్చినట్లు పేర్కొన్నారు.

News February 23, 2025

HYD: చీర కట్టి.. పరుగు పెట్టి..!

image

‘చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో’ అనే పాట వినే ఉంటారు. చీర కట్టుతో అందంగా కనిపించడమే కాదు ఫిట్‌నెస్ కూడా సాధ్యమేనని పలువురు మహిళలు చాటి చెప్పారు. HYD నెక్లేస్ రోడ్డులో ఆదివారం ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో శారీ రన్(SAREE RUN) నిర్వహించారు. ఈ వాకాథాన్‌లో 3,120 మంది మహిళలు చీరకట్టుతో పాల్గొన్నారు. వీరిలో ఓ మహిళ తన బిడ్డతో పాటు పాల్గొని పరుగులు పెట్టడం అందరినీ ఆకర్షించింది.

News February 23, 2025

బాపట్ల జిల్లా విద్యుత్ వినియోగదారులకు గమనిక

image

కరెంట్ బిల్లు చెల్లించుటకు బాపట్ల జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కేంద్రాలలోని కౌంటర్లు ఆదివారం తెరిచే ఉంటాయని, బాపట్ల విద్యుత్ శాఖ సూపరింటెండ్ ఇంజినీర్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి, ఇప్పటివరకు విద్యుత్ బిల్లులు చెల్లించనివారు నేడు బిల్లులను చెల్లించాలని కోరారు.

error: Content is protected !!