News February 1, 2025
బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. బీఆర్ఎస్ నుంచి ఎవరో..?

ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టబద్రుల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థిగా విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డిని నిన్న ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ, కేసీఆర్ సొంత ఇలాకాలో బీఆర్ఎస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
Similar News
News September 13, 2025
మెదక్: లోక్ ఆదాలత్‌లో 4,987 కేసుల పరిష్కారం: ప్రధాన న్యాయమూర్తి

జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 4,987 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ తెలిపారు. మెదక్, నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టులలో ఏర్పాటు చేసిన ఏడు బెంచ్‌ల ద్వారా ఈ కేసులను పరిష్కరించారని, వీటి విలువ రూ.1,04,88,964 అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శుభవల్లి, ప్రిన్సిపల్ జడ్జిలు సిరి సౌజన్య, సాయి ప్రభాకర్ పాల్గొన్నారు.
News September 13, 2025
మెదక్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్

మెదక్ జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ నీలిమ సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ ఎం.శుభవల్లి పర్యవేక్షించారు. రాజీ మార్గమే రాజమర్గమన్నారు. ఈ సందర్బంగా పలువురు తమ కేసుల్లో రాజీ పడ్డారు. న్యాయమూర్తులు సిరి సౌజన్య, సాయి ప్రభాకర్, స్వాతి, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.
News September 13, 2025
మెదక్: తైబజార్ వసూళ్లు రద్దుకు ఆదేశం

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మెదక్‌లో గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో తైబజార్ రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి పైన కేసు నమోదు చేయాలని డీఎస్పీకి సూచించారు.