News April 12, 2024
బీజేపీ జెండా ఎగురవేయాలి: KVR

ఆందోల్ నియోజకవర్గం టెక్మాల్‌లో జహీరాబాద్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల ప్రభారీ అభయ్ పాటిల్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయాలని వారు సూచించారు.
Similar News
News April 19, 2025
NZB: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య..

నిజామాబాదు లో గూడ్స్ రైలు కిందపడి గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే ఎస్సై సాయి రెడ్డి శుక్రవారం తెలిపారు. స్టేషన్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహన్ని మార్చురికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయసు 40-45 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు.
News April 19, 2025
NZB: మద్యం తాగుతూ.. పాటలు వింటూ మృతి(UPDATE)

నగరంలోని సుభాష్ నగర్లో ఆటోలో మృతి చెందిన వ్యక్తిని న్యూ ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బాలచందర్(36)గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆటోలో పాటలు వింటూ మద్యం సేవిస్తుండగా ఒకసారిగా ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని మార్చురీకి తరలించారు.
News April 19, 2025
NZB: కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు: కలెక్టర్

జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తినా, ధాన్యం అమ్మకాల్లో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు ఏర్పడితే వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 6644కు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చన్నారు.