News April 10, 2024

బీజేపీ ప్రచారానికి విదేశీ రాజకీయ పార్టీలు

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కొత్త పంథాను అనుసరిస్తోంది. తమ ప్రచారానికి 25 దేశాలకు చెందిన రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. వాటిలో 13 దేశాల పార్టీలు ఆహ్వానాన్ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. బ్రిటన్, జర్మనీ, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాల పార్టీల ప్రతినిధులు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో ఎన్నికలుండటంతో ఆ దేశపు పార్టీలను మాత్రం బీజేపీ ఆహ్వానించలేదని సమాచారం.

Similar News

News February 28, 2026

MAR 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’: CM రేవంత్

image

TG: అభివృద్ధి ప్రణాళికల అమలుకు MAR 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పేరిట 99days కార్యక్రమం నిర్వహించనున్నట్లు CM రేవంత్ తెలిపారు. ‘ప్రభుత్వ ఆఫీసులు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదు. ఫైళ్ల క్లియరెన్స్ నిర్ధిష్ట సమయంలో జరగాలి. కంపెనీల ఒప్పందాలు, పెట్టుబడులు గ్రౌండ్ కావాలి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. 100 నియోజకవర్గాల్లో TG పబ్లిక్ స్కూళ్లు ప్రారంభించాలి’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News February 28, 2026

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారా?

image

US, Israel దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. దీనిని ఇరాన్ వర్గాలు ఖండించాయి. తనకు తెలిసినంత వరకు ఖమేనీ బతికే ఉన్నారని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ తెలిపారు. కాగా ఖమేనీ పరిస్థితిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు Israel దాడుల్లో ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అమీర్ నాసీర్జాదే, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి.

News February 28, 2026

రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

image

AP: అనకాపల్లి(D) రాంబిల్లి(M) సీతాపాలెం సెజ్‌లో బ్లూ జెట్ హెల్త్ కేర్ కంపెనీ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. ₹2,300Cr పెట్టుబడితో చేపడుతున్న ఈ అధునాతన ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియట్స్& CDMO ఫెసిలిటీ ఉత్తరాంధ్ర ఇండస్ట్రీయల్ గ్రోత్‌కు బూస్ట్ ఇస్తుందని పేర్కొన్నారు. దీని ద్వారా 1,750 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు క్యూ కడుతున్నాయన్నారు.