News February 16, 2025
బీటెక్ పట్టభద్రులకు బీఎఫ్ఎస్ఐ – స్కిల్లింగ్ కోర్సు: మంత్రి శ్రీధర్ బాబు

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలు కోసం ప్రయత్నిస్తున్న పట్టభద్రులు స్కిల్స్ యూనివర్సిటీ వెబ్ సైట్ ( yisu.in ) తరచూ సందర్శించాలని మంత్రి సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు.
Similar News
News January 5, 2026
రాజీనామాపై మరోసారి ఆలోచించండి.. కవితకు ఛైర్మన్ సూచన

TG: MLC పదవికి రాజీనామాపై మరోసారి ఆలోచించుకోవాలని కవితకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ సూచించారు. ‘కవిత ఆవేదనను అర్థం చేసుకున్నాం. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది. భావోద్వేగంలో నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు’ అని పేర్కొన్నారు. అయితే తాను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని, రాజీనామాను ఆమోదించాలని ఆమె కోరారు. వ్యక్తిలా వెళ్లి శక్తిలా తిరిగొస్తానన్నారు.
News January 5, 2026
నిర్మల్: మున్సిపల్ రేసులో పెరగనున్న ఎన్నికల వేడి

జిల్లాలోని 3 మున్సిపాలిటీల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. తాజా గణాంకాల ప్రకారం NRMLలో 98,295, భైంసా 51,118, ఖానాపూర్‌లో 17,693 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం పెరగడం, పాత వార్డుల్లో కుటుంబాల విస్తరణతో తుది జాబితా నాటికి ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఓట్ల సంఖ్య పెరిగితే మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై అదనపు భారం పడనుంది.
News January 5, 2026
HYD: 1,200 బస్సులతో సంక్రాంతికి వస్తున్నాం..!

జనవరి వచ్చిందంటే సంక్రాంతి ముచ్చట్లే ఉంటాయి. సొంతూరుకు ఎప్పుడెళ్లాలి? ఎలా వెళ్లాలి? అనే చర్చలు ఎక్కడ చూసినా ఉంటాయి. సంక్రాంతి సెలవుల్లో సొంతూరిలో గడిపితే ఆ మజానే వేరబ్బా అని పలువురు నగరవాసులు భావిస్తున్నారు. అందుకే ఆర్టీసీ నగర ప్రయాణికుల కోసం ఈ ఏడాది 1,200 ప్రత్యేకంగా బస్సులను వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. ఈ నెల 9 నుంచి ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించింది.


