News March 15, 2025
బీటెక్ విద్యార్థి అదృశ్యం

నల్లమాడ (మం) ఎద్దులవాండ్ల పల్లికి చెందిన రామ్మోహన్ రెడ్డి కుమారుడు బీటెక్ విద్యార్థి లక్ష్మీకాంత్ రెడ్డి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తన కుమారుడు అనంతపురం పీవీకేకే కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని తెలిపారు. ఈనెల 7న బైక్‌పై బెంగళూరుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి, అప్పటి నుంచి కనిపించకుండా పోయాడని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
Similar News
News March 16, 2025
నారపల్లి: పాత నాణేల మాయ.. మోసపోయిన మహిళ

పాత నాణేలు విక్రయిస్తే రూ.లక్షలు వస్తాయని నమ్మబలికి ఓ మహిళను నట్టేట ముంచారు. పోలీసుల ప్రకారం.. పాత నాణేలు విక్రయిస్తే రూ.46 లక్షలు వస్తాయని ఓ మహిళను నమ్మించారు. ప్రాసెసింగ్ ఫీజ్, ట్యాక్స్, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఆమె నుంచి ₹1.36 లక్షలు లూటీ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోసపూరిత ప్రకటనలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
News March 16, 2025
KMM: అనుమానంతో భార్యను, మరొకరిని నరికిన భర్త

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే అనుమానంతో భార్యతో పాటు మరొకరిని భర్త కొడవలితో నరికిన ఘటన ఖమ్మం పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఇద్దరిపై వేటకొడవలితో దాడి చేయగా వారి పరిస్థితి విషమంగా ఉంది. భర్త పరారీలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.