News September 24, 2025
బీద రవిచంద్రకు అరుదైన అవకాశం

నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు అరుదైన అవకాశం వచ్చింది. ఇవాళ ఉదయం శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు సభను ప్రారంభించారు. కొన్ని చర్చల తర్వాత ఆయన రెస్ట్ తీసుకున్నారు. ఆ సమయంలో ఛైర్మన్ హోదాలో రవిచంద్ర ఆ కుర్చీలో కూర్చొని సభను నడిపించారు. సభ్యుల ప్రశ్నోత్తరాల సమయానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూశారు.
Similar News
News September 24, 2025
GST 2.0తో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట: కలెక్టర్

GST 2.0తో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలుగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. GST 2.0 వ్యవసాయం, పారిశ్రామిక, భవన నిర్మాణం, విద్యారంగం, వర్తక రంగాలకు ఎంతో ఊతమిస్తుందన్నారు. ప్రజలు వినియోగించే నిత్యావసరాలు, మెడిసిన్, వ్యసాయ పరికరాలు, భవన నిర్మాణ సామాగ్రి, ఆటోమొబైల్ రంగాల్లోని ఉత్పత్తులపై భారీగా జీఎస్టీ తగ్గిందన్నారు.
News September 24, 2025
NLR: ఛైర్మన్‌గా పెళ్లకూరు బాధ్యతల స్వీకరణ

ఏపీ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్‌గా టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. చాలా ఏళ్ల నుంచి సోమిరెడ్డి అనుచరుడిగా శ్రీనివాసులు రెడ్డి కొనసాగుతున్నారు.
News September 24, 2025
నెల్లూరు జిల్లా DSC అభ్యర్థులకు గమనిక

డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో గురువారం నియామక పత్రాలు అందజేస్తామని నెల్లూరు డీఈవో బాలాజీ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారంతా నేటి సాయంత్రం 4 గంటలలోపు గొలగమూడి ఆశ్రమం వద్దకు రావాలని సూచించారు. ఇక్కడి నుంచి బస్సుల్లో విజయవాడకు తీసుకెళ్తామన్నారు.