News June 20, 2024

బీద రవిచంద్రకు MLC..?

image

కావలికి చెందిన బీద రవిచంద్ర టీడీపీ కీలక నేతగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. గతంలో ఎమ్మెల్సీగా పని చేశారు. తాజాగా రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఈక్రమంలో మరోసారి రవిచంద్రకు చంద్రబాబు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని ఆయన అనుచరులు ఉంటున్నారు.

Similar News

News March 23, 2026

ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసిన వేమిరెడ్డి దంపతులు

image

భారత ప్రధానిగా ఎక్కువ కాలం సేవలందించిన ప్రధాని మోదీకి వేమిరెడ్డి దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఢిల్లీలో ప్రధానిని కలిసి పూల బొకే ఇచ్చారు. ఈ సందర్భంగా MP ప్రభాకర్ రెడ్డి, MLA ప్రశాంతి రెడ్డి మాట్లాడారు. ప్రధానిగా 8,931 రోజులు కంటే ఎక్కువ కాలం పని చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. వికసిత భారత్ లక్ష్యాన్ని 2047లోగా ఆయన సాధించేలా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుడిని కోరినట్లు వారు తెలిపారు.

News March 23, 2026

నెల్లూరులో వణుకు పుట్టిస్తున్న ASP దీక్ష..!

image

నెల్లూరులో 2 నెలల కిందట బాధ్యతలు తీసుకున్న ASP దీక్ష తనదైన ముద్ర వేస్తున్నారు. సిటీలో ఆకస్మిక తనిఖీలకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఏకకాలంలో లాడ్జీలపై దాడులు చేసి <<19450738>>వ్యభిచార ముఠాను <<>>పట్టుకున్నారు. నగరంలోని దాబాల్లో రాత్రి వేళ మద్యం విక్రయాలు జరగుతున్నాయి. దీనిపైనా ఆమె దాడులు చేసి ఒకేసారి <<19452217>>40మందిని <<>>పట్టుకున్నారు. రౌడీషీటర్లకు సైతం తనదైన శైలిలో వార్నింగ్‌లు ఇస్తున్నారు.

News March 23, 2026

‘వాట్సాప్’ల్లోనే అమ్మాయిల వివరాలు: నెల్లూరు ASP

image

నెల్లూరులో <<19448814>>వ్యభిచార<<>> ఘటనపై ASP దీక్ష మాట్లాడారు. ‘గతవారమే మాకు సమాచారం వచ్చింది. చిన్నబజార్‌లోని నాలుగు లాడ్జిల్లో సోదాలు చేశాం. లాడ్జి ఓనర్లు అమ్మాయిలను HYD, బెంగళూరు నుంచి రప్పించి వారి ఫొటో, రేట్ నిర్ణయించి కస్టమర్‌కు వాట్సాప్ చేస్తారు. దీంతో ఇవాళ మా టీమ్‌తో దాడులు చేశాం. ఓ అమ్మాయితో నలుగురు విద్యార్థులు ఉండగా పట్టుకున్నాం. ఈ ఘటనలో 27 ఫోన్లు సీజ్ చేశాం. కేసు నమోదు చేస్తాం’ అని ASP తెలిపారు.