News February 6, 2025

బీఫామ్ అందుకున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి

image

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతులు మీదుగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమలై అంజిరెడ్డి బీఫారం అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News February 25, 2026

ADB: ఉదయం కూతురి నిశ్చితార్థం.. రాత్రి తండ్రి మృతి

image

బోథ్‌లో మంగళవారం విషాదం జరిగింది. కుమార్తె నిశ్చితార్థం ముగిసిన కొద్ది గంటల్లోనే తండ్రి మరణించడంతో ఆ ఇంట్లో విషాదం నిండుకుంది. పందిరి శంకర్ తన కుమార్తె నిశ్చితార్థాన్ని సోమవారం ఘనంగా జరిపించారు. బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుండగానే, అదే రాత్రి ఆయన నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశారు. పెళ్లి పీటలపై కూతురిని చూడాల్సిన తండ్రి విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

News February 25, 2026

టెన్షన్ వద్దు.. మీ గెలుపు మీ చేతుల్లోనే!

image

TG: ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి MAR 18 వరకు బిగ్ డేస్. ఇవాళ్టి నుంచే వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. టెన్షన్ పడితే తెలిసినవి కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే కూల్‌గా ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లండి. ప్రశ్నపత్రం చూడగానే కంగారు పడకుండా మీకు బాగా వచ్చిన ప్రశ్నలతోనే మీ స్కోరింగ్ వేటను ప్రారంభించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రతి నిమిషాన్ని తెలివిగా వాడుకోండి. ALL THE BEST

News February 25, 2026

KMR: నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు

image

కామారెడ్డి జిల్లాలో నేటి నుంచి మార్చి 17 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 37 కేంద్రాల్లో 17,953 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రథమ సంవత్సరంలో 9,013 మంది, ద్వితీయ సంవత్సరంలో 8,940 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 37 మంది చీఫ్ సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.