News May 7, 2024
బీఫార్మసీ, బీపీఈడీ ఫలితాలు విడుదల

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఫార్మసీ, బీపీఈడీ పరీక్ష ఫలితాలు విడదలయ్యాయని యూనివర్శిటీ పరీక్షల నియంత్రణాధికారి డా. శ్రీరంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. బీఫార్మసీ 1,2,7,8వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు, బీపీఈడీ 1, 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలు వెబ్‌సైట్ www.satavahana.ac.inలో అందుబాటులో ఉన్నాయన్నారు.
Similar News
News December 13, 2025
KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల కేటాయింపుల్లో గందరగోళం

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విధుల కేటాయింపుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ర్యాండమైజేషన్ ప్రక్రియలో జరిగిన తప్పిదాల కారణంగా, ఇప్పటికే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు, బదిలీపై వేరే జిల్లాకు వెళ్లిన ఉద్యోగులు కూడా విధులకు హాజరు కావాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల ఉద్యోగుల్లో అయోమయం, ఆందోళన పెరిగింది.
News December 13, 2025
సైబర్ నేరగాళ్లపై కరీంనగర్ సీపీ ఉక్కుపాదం

టెక్నాలజీపై పట్టున్న కరీంనగర్ CP గౌస్ ఆలం ఆర్థిక నేరగాళ్లను వేటాడుతున్నారు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసును చేధిస్తూ బాధితులలో భరోసా నింపుతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన మేటా ఫండ్ కింగ్ పిన్ లోకేశ్వర్‌ను పట్టుకొని కటకటాల్లోకి పంపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 281 సైబర్ కేసులు నమోదయ్యాయి. రూ.90,77,918 రికవరీ చేసి బాధితులకు అందించారు.
News December 13, 2025
KNR: 567 మంది మహిళలు మాయం

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో Jan 2024 నుంచి Oct 2025 వరకు 567 మంది మహిళలు, యువతుల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇవేగాకుండా పోలీసుల దృష్టికి రానివి అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని కేసులు పోలీసులు చేదిస్తే చాలా కేసులు మిస్టరీగానే ఉండిపోతున్నాయి. అదృశ్యమైన వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోతున్నారనేది అంతుచిక్కట్లేదు. కొందరు రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.


