News July 31, 2024
బీబీనగర్: అన్నదమ్ముల మృతి

బీబీనగర్-పోచంపల్లి రహదారిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బడుగు నరసింహ అనే వ్యక్తి మృతిచెందాడు. బాధాకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన నరసింహ అన్న బడుగు స్వామి అనారోగ్యంతో మహారాష్ట్రలో చనిపోయినట్లు సమాచారం వచ్చింది. పోచంపల్లిలో ఉన్న కుటుంబ సభ్యులకు సోదరుడు చనిపోయిన విషయం చెప్పాలని బీబీనగర్ నుంచి బైక్‌పై బయల్దేరాడు. బీబీనగర్ దాటిన వెంటనే ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొని చనిపోయాడు.
Similar News
News December 28, 2025
NLG: ముందుగానే మున్సి ‘పోల్స్’….!

మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు వివిధ పథకాల కింద గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎప్పుడు షెడ్యూల్ వచ్చినా… ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
News December 28, 2025
వణికిస్తున్న చలి.. పెరిగిన వైరల్ జ్వరాల ఉద్ధృతి

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. వేకువజామున వీస్తున్న చలిగాలులతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల జిల్లావ్యాప్తంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు జలుబు, దగ్గు, జ్వరంతో ఆసుపత్రుల బాట పడుతున్నారు.
News December 28, 2025
NLG: అంగన్వాడీల యాప్ సోపాలు!

జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు యాప్‌లతో ఆపసోపాలు పడుతున్నారు. యాప్‌లను నిర్వహించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పోషణ ట్రాకర్, బాల సంజీవని యాప్ లబ్దిదారుల ముఖ హాజరు నమోదుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,093 కేంద్రాలు ఉన్నాయి. పోషన్ ట్రాకర్ యాప్‌తో ఫేస్ రీడింగ్ చేయని లబ్ధిదారులకు ఆరోజు పౌష్టికాహారం పంపిణీ చేయడం లేదు. దీంతో గంటల తరబడి కేంద్రాల ఎదుట పడిగాపులు కాయాల్సి వస్తుంది.


