News October 23, 2025

బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్‌గా అమిత అగర్వాల్ బాధ్యతల స్వీకరణ

image

బీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ అమిత అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎయిమ్స్ కార్యకలాపాలు, అవసరాలపై ప్రత్యక్ష దృష్టి సారిస్తానని తెలిపారు. విద్యాపరమైన పురోగతికి ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు ప్రతి విభాగాన్ని వ్యక్తిగతంగా సందర్శిస్తానని ఆమె పేర్కొన్నారు.

Similar News

News October 23, 2025

కీసర: మహత్మా జ్యోతిబా ఫూలే స్కూల్‌లో కలెక్టర్ తనిఖీ

image

కీసర మండలం బోగారంలో నిర్వహిస్తున్న మల్కాజిగిరి, ఘట్‌కేసర్ మహత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ బాలికల ఉన్నత పాఠశాలను గురువారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ.. మీలోని భయాన్ని విడిచి నలుగురిలో మాట్లాడడం నేర్చుకోవాలని, అది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందన్నారు.

News October 23, 2025

మరో నాలుగైదు రోజులు వర్షాలు: APSDMA

image

AP: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, ఏలూరు, ప.గో., NTR, ఉమ్మడి తూ.గో., విశాఖ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.

News October 23, 2025

పత్తి కొనుగోలుపై అదనపు కలెక్టర్ సమీక్ష

image

మహబూబాబాద్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పత్తి కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో పత్తి కొనుగోలు యాక్షన్ ప్లాన్‌ను అధికారులకు వివరించారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 84,728 ఎకరాల్లో పత్తి పంట సాగు జరిగిందని 6,14,000 క్వింటాల పత్తి దిగుబడి వస్తుందన్నారు. జిల్లాలో పత్తి పంట కొనుగోలు చేసేందుకు ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.