News February 25, 2026
బీబీనగర్-నడికుడి రైల్వే భూ సేకరణ ప్రక్రియ వేగవంతం

బీబీనగర్-నడికుడి రైల్వే రెండో లైన్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆర్డీఓ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం భువనగిరి మండలంలోని పగిడిపల్లి, అనాజిపురం, నందనం, బొమ్మాయిపల్లి తదితర గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతుల భూముల వివరాలను సేకరించి, సరిహద్దులను పరిశీలించారు. రైల్వే లైన్ విస్తరణకు అవసరమైన భూసేకరణలో పారదర్శకత పాటిస్తామని ఆర్డీఓ వెల్లడించారు.
Similar News
News February 27, 2026
LSG కొత్త జెర్సీ రిలీజ్

IPL-2026: LSG జట్టు కొత్త జెర్సీని రిలీజ్ చేసింది. ఓనర్ సంజీవ్ గోయెంకా తన జట్టు కొత్త డ్రస్సును రివీల్ చేశారు. కొత్త జెర్సీతో ఉన్న స్క్వాడ్ ఫొటోను LSG SM పేజీల్లో షేర్ చేసింది. అయితే ఇది ఫుట్‌బాల్ టీమ్ డ్రస్సును పోలి ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక గతేడాది లీగ్‌లో 14 మ్యాచులు ఆడిన LSG 8 మ్యాచుల్లో ఓడిపోయి పెద్దగా ప్రభావం చూపలేదు. కొత్త జెర్సీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
News February 27, 2026
నిర్మల్: నేషనల్ మెరిట్ టెస్టులో 70 మంది విద్యార్థులు అర్హత

నవంబర్ 2025లో జరిగిన నేషనల్ మీన్స్ కం మెరిట్ పరీక్షలో నిర్మల్ జిల్లాకు చెందిన 70 మంది విద్యార్థులు స్కాలర్షిప్ కు అర్హత సాధించారని డీఈఓ భోజన్న తెలిపారు. ఈ మేరకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ప్రొవిజినల్ లిస్టును జారీ చేశారు. జిల్లాలో ఈ సంవత్సరం అత్యధికంగా విద్యార్థులు అర్హత సాధించడం పట్ల డీఈవో భోజన్న విద్యార్థులను అభినందించారు.
News February 27, 2026
విశాఖ: రోడ్డు ప్రమాదంలో కోర్టు ఉద్యోగి మృతి

విశాఖ రైల్వే స్టేషన్ గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు జిల్లా కోర్టులో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు సిబ్బంది మృతితో తోటి ఉద్యోగుల్లో విషాదం నెలకొంది.


