News November 15, 2024

బీబీపేట్: ‘గ్రూప్4లో సత్తా చాటిన యువకుడు’

image

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని యాడారం గ్రామానికి చెందిన దుర్గప్రసాద్ గురువారం ప్రకటించిన గ్రూప్-4 తుది ఫలితాలలో సత్తాచాటాడు. రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపిక అయ్యాడు. అయితే ఇది వరకే ఈ యువకుడు పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే, ఈ పరీక్షకి సన్నద్ధమైనట్లు దుర్గప్రసాద్ తెలిపాడు. 

Similar News

News November 15, 2024

లింబాద్రి గుట్ట: నేడే రథోత్సవం-సర్వం సిద్ధం

image

భీంగల్ మండలం లింబాద్రి గుట్టపై శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం జరగనుంది. భక్తులంతా రథోత్సవాన్ని వీక్షించేలా నేడు ఉదయం 11:30గంటల నుంచి యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో చుట్టూ పక్కల గ్రామాల భక్తులే కాకుండా జిల్లా నుంచి పాల్గొంటారు. భక్తుల తాకిడి అధికంగా ఉండే నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News November 15, 2024

బీబీపేట్: ‘గ్రూప్4లో సత్తా చాటిన యువకుడు’

image

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని యాడారం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ గురువారం ప్రకటించిన గ్రూప్-4 తుది ఫలితాలలో సత్తాచాటాడు. రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపిక అయ్యాడు. అయితే ఇది వరకే ఈ యువకుడు పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే, ఈ పరీక్షకి సన్నద్ధమైనట్లు దుర్గాప్రసాద్ తెలిపాడు. 

News November 15, 2024

NZB: ‘విఫలమైన రైస్ మిల్లర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి’

image

ధాన్యం కేటాయింపులకు అనుగుణంగా మిల్లింగ్ జరిపి బియ్యం నిల్వలను తిరిగి అందించడంలో విఫలమైన రైస్ మిల్లర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణా రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ లెవీ లక్ష్యానికి విఘాతం కల్పించిన మిల్లర్లపై అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయోగించాలని అన్నారు. డిఫాల్టర్లుగా లేని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించాలని సూచించారు.