News November 15, 2024

బీబీపేట్: ‘గ్రూప్4లో సత్తా చాటిన యువకుడు’

image

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని యాడారం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ గురువారం ప్రకటించిన గ్రూప్-4 తుది ఫలితాలలో సత్తాచాటాడు. రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపిక అయ్యాడు. అయితే ఇది వరకే ఈ యువకుడు పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే, ఈ పరీక్షకి సన్నద్ధమైనట్లు దుర్గాప్రసాద్ తెలిపాడు. 

Similar News

News March 2, 2026

NZB: హోలీ పండుగకు పటిష్ట భద్రత ఏర్పాట్లు: సీపీ

image

హోలీ పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం పేర్కొన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో సహజసిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో స్నానాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై దృష్టి సారించాలన్నారు.

News March 2, 2026

NZB: అదనపు కలెక్టర్‌గా దిలీప్ కుమార్ బాధ్యతలు

image

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన అంకిత్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లడంతో ప్రభుత్వం దిలీప్ కుమార్‌ను ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించింది. బాధ్యతల స్వీకారం అనంతరం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News March 2, 2026

NZB: హోలీ వేళ పోలీసుల ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

image

హోలీ పండుగ సందర్భంగా నిజామాకబాద్ జిల్లా ప్రజలు పోలీసు నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై లేదా వాహనాలపై బలవంతంగా రంగులు, నీటిని చల్లడం నిషేధమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే నిజామాబాద్ పోలీస్ చట్టం సెక్షన్ 76 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆంక్షలు ఈనెల 2వ తేదీ సాయంత్రం 6 నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు.