News January 20, 2026

బీబీపేట్: పురుగు మందు తాగి సూసైడ్

image

బీబీపేట్ మండలం ఇస్సానగర్‌కు చెందిన ధర్మగారి రాజాగౌడ్(34) సోమవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య శైలజతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. బీబీపేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Similar News

News February 24, 2026

సింహాచలం ట్రస్ట్ బోర్డు… నిర్ణయం పెండింగ్? (1/1)

image

సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన దేవాలయాలకు బోర్డులు నియమిస్తున్న నేపథ్యంలో సింహాచలానికి కూడా 22 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జరిగింది. TTD తరహాలో ఇక్కడ కూడా చోటు కోసం TDP,జనసేన,BJP నేతలు ఇప్పటికే ఎదురు చూపులు చూస్తున్నారు.అశోక్ గజపతి నిర్ణయం వల్లన ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది.

News February 24, 2026

HYD: నేడు ఆర్టీసీ సంఘాల చలో సెక్రటేరియట్

image

నేడు ఆర్టీసీ సంఘాలు చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా సొంతంగా సమకూర్చుకోవడం, ఉద్యోగులపై పని ఒత్తిడి, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లతో నిరసన వ్యక్తం చేయనున్నాయి. దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చయి.