News August 23, 2024
బీర్ బాటిల్‌తో ఆర్టీసీ బస్సుపై దాడి

గుంటూరు నుంచి భద్రాచలం వెళ్తున్న కొత్తగూడెం డిపోకి చెందిన డీలక్స్ బస్సుపైకి మందుబాబులు బీరు బాటిల్ విసిరారని ప్రయాణికులు తెలిపారు. V.M బంజార సమీపంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. బాటిల్ విండో గ్లాస్‌కు తగిలి సీట్లో కూర్చున్న మహిళ కంటికి గాయమైంది. ఆమెను V.M బంజార ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు V.M బంజర పోలీసులు తెలిపారు.
Similar News
News February 12, 2026
ఖమ్మం: మున్సిపల్ కౌంటింగ్.. కలెక్టర్ కీలక ఆదేశాలు

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. కేంద్రాల్లో 100% వెబ్ క్యాస్టింగ్, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని, అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలన్నారు.
News February 12, 2026
ఖమ్మం ఆసుపత్రికి మహర్దశ.. కలెక్టర్ చొరవతో కొత్త రోడ్లు

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దశాబ్దం కాలంగా అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లకు మోక్షం లభించింది. కలెక్టర్ ఆదేశాలతో కార్పొరేషన్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, టాయిలెట్ల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టనున్నారు. దీనివల్ల నిత్యం ఆసుపత్రికి వచ్చే 5 వేల మంది రోగులు, సిబ్బందికి దుమ్ము, ధూళి సమస్యల నుంచి విముక్తి కలగనుంది.
News February 12, 2026
5 మున్సిపాలిటీల్లో కట్టుదిట్టమైన బందోబస్తు: ఖమ్మం కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 5 మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఎంట్రెన్స్, ఎగ్జిట్‌లు, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. ఏదులాపురం(31), మధిర(22), సత్తుపల్లి(23), వైరా, కల్లూరు (20) వార్డులకు 2 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు.


