News March 17, 2025

బీసీ ఎమ్మెల్యేలతో మంత్రుల సమావేశం

image

బీసీ ఎమ్మెల్యేలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ప్రకాష్ గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య ,మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టనుండడంతో బిల్లు సజావుగా అన్ని పార్టీల మద్దతు ఇచ్చేలా మాట్లాడాలన్నారు.

Similar News

News March 17, 2025

ఎంపీ డీకే అరుణ నివాసంలో హైదరాబాద్ పోలీసులు

image

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఓ ఆగంతకుడు చొరబడి గంటన్నర పాటు ఇంట్లో పలు గదులలో తిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై డీకే అరుణ భద్రత కల్పించాలని కోరారు. అందులో భాగంగా హైదరాబాద్ డీసీపీ విజ‌య్ కుమార్‌, ఏసీపీ వెంక‌టగిర సోమవారం ఎంపీ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆగంతకుడు తిరిగిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు డీకే అరుణను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News March 17, 2025

కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రుల పిటిషన్ కొట్టివేత

image

కోల్‌కతా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచారం కేసుకు సంబంధించి మళ్లీ CBI విచారణ చేయించాలని ఆమె తల్లిదండ్రులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ జరిపిన కోర్టు దాన్ని కొట్టేస్తూ.. కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ కొనసాగించవచ్చని సూచించింది. గతేడాది ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్‌ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై అఘాయిత్యం జరిగింది. నిందితుడు సంజయ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.

News March 17, 2025

బాపట్ల: సారా నిర్మూలనకు నవోదయం 2.0 ప్రారంభం

image

నాటుసారాను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. సోమవారం బాపట్లలో అధికారులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని సారా రహితంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందన్నారు. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి ప్రత్యామ్నాయం మార్గాలను చూపిస్తామన్నారు.

error: Content is protected !!