News February 7, 2025
బీసీ కులగణన సర్వే చారిత్రాత్మకం: మంత్రి కొండా

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన బీసీ కులగణన సర్వే చారిత్రాత్మకం అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఒక బీసీ బిడ్డగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె గురువారం కాంగ్రెసు హైకమాండ్‌కు లేఖలు రాశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎల్ఓపీ రాహుల్ గాంధీ తదితరులకు లేఖలు పంపినట్లు తెలిపారు.
Similar News
News December 30, 2025
ఈ సమస్యలుంటే ఉపవాసం చెయ్యకూడదు

ఉపవాసం మంచిదే అయినా గుండె జబ్బులు ఉన్నవారికి మంచిది కాదంటున్నారు నిపుణులు. అలాగే బీపీ, కొరోనరీ ఆర్టరీ వ్యాధులు, అరిథ్మియా సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేస్తే చక్కెర స్థాయిలు, ఎలక్ట్రోలైట్ సమతుల్యత, నీటి శాతం తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. బీటా బ్లాకర్స్, యాంటీ అరిథమిక్స్, బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటే ఆహారంతో పాటు సమయానికి మందులను వేసుకోవాలి. కాబట్టి ఉపవాసానికి దూరంగా ఉండాలి.
News December 30, 2025
సంక్రాంతికి టోల్ ‘ఫ్రీ’ అమలు చేయండి: కోమటిరెడ్డి

TG: సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-హైదరాబాద్ మార్గాల్లో టోల్ ప్లాజాల వద్ద ఫీజు వసూలు చేయొద్దని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని జనవరి 9 నుంచి 18 వరకు దీన్ని అమలు చేయాలని కోరారు. ఇక సంక్రాంతి వేళ విజయవాడ-హైదరాబాద్ మధ్య ట్రాఫిక్ సమస్యపై CM రేవంత్ ప్రత్యేక దృష్టి సారించినట్లు కోమటిరెడ్డి మీడియాకు చెప్పారు.
News December 30, 2025
పాలమూరు: రేపు కురుమూర్తి స్వామి గిరిప్రదక్షిణ

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన కురుమూర్తి స్వామి క్షేత్రంలో బుధవారం గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలుగొందుతున్న స్వామివారి గిరిప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.


