News August 26, 2025
బీసీ సంక్షేమాధికారిగా విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమాధికారిగా పి.విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఇప్పటివరకు ఈ విధులను నిర్వహించిన ఇందిర భూపాలపల్లికి బదిలీ అయ్యారు. గతంలో బీసీ అభివృద్ధి అధికారిగా పనిచేసిన విజయలక్ష్మి పదోన్నతి పొంది బీసీ సంక్షేమాధికారిగా నియమితులయ్యారు.
Similar News
News August 26, 2025
నేవీలో ఉద్యోగం సాధించిన గొల్లమాడ యువకుడు

నర్సాపూర్(జి) మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన వంశీ ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించాడు. గ్రామానికి చెందిన రవి- రాధ దంపతుల పెద్ద కొడుకైన వంశీ మొదటి ప్రయత్నంలోనే నేవీలో మెడికల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. తండ్రి వ్యవసాయం చేస్తూ, తల్లి బీడీలు చుట్టి బిడ్డను చదివించారు. వంశీ కష్టపడి చదివి ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
News August 26, 2025
పార్వతీపురం: ‘స్థలాలు గుర్తించి గ్రౌండింగ్ చేయండి’

జిల్లాలో పరిపాలన ఆమోదం పొందని పంచాయతీ భవనాలకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి తక్షణమే గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ పంచాయతీ రాజ్ సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లను ఆదేశించారు. పార్వతీపురం జిల్లాకు 80 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు కాగా, 68 భవనాలకు పరిపాలన ఆమోదం మంజూరు చేశామన్నారు. మంగళవారం లోగా స్థలాలను గుర్తించి పరిపాలన ఆమోదం పొందాలని స్పష్టం చేశారు.
News August 26, 2025
బ్యాంకులు ప్రజలను నియంత్రించొద్దు: సీఎం

AP: బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ప్రజలను నియంత్రించొద్దని CM చంద్రబాబు అన్నారు. బ్యాంకర్లతో సమావేశంలో మాట్లాడారు. ‘ఇప్పటికే రైతులకు రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వాల్సింది. సీజన్ చివర్లో ఇస్తే ప్రయోజనం ఉండదు. సంస్కరణల దిశగా ప్రజలను ప్రోత్సహించాలి. రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిర్ణయాలుండాలి’ అని సూచించారు. ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’కు బ్యాంకుల సహకారంపై చర్చించారు.