News December 26, 2025
బీసీ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.90.50 కోట్లు మంజూరు

AP: ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థుల కోసం రూ.90.50 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు మంజూరు చేసినట్లు మంత్రి సవిత తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి గానూ పోస్ట్ మెట్రిక్ రెండో విడతకు రూ.69.40Cr, ప్రీ మెట్రిక్ రెండో విడతకు రూ.21.10Cr స్కాలర్‌షిప్ ఫండ్స్ కేటాయించినట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో బీసీ విద్యార్థులు విద్యకు దూరం కాకూడదన్నదే తమ లక్ష్యమన్నారు.
Similar News
News December 29, 2025
రైతా ఎంత పనిచేసింది.. 200 మందికి రేబీస్ వ్యాక్సిన్లు

UPలోని బదౌన్ జిల్లా పిప్రౌలి గ్రామస్థులు రేబీస్ భయంతో వణికిపోతున్నారు. ఇటీవల గ్రామంలో నిర్వహించిన ఓ విందులో రైతా(పెరుగు పచ్చడి) వడ్డించారు. అయితే ఆ రైతాకు కుక్క కాటుకు గురైన ఓ గేదె పాలను ఉపయోగించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ గేదె రేబీస్ లక్షణాలతో మృతిచెందడంతో అధికారులు మొత్తం 200 మందికి యాంటీ రేబీస్ టీకాలు వేశారు. భయపడాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపారు.
News December 29, 2025
ఉన్నావ్ రేప్ కేసు.. సెంగార్‌ను విడుదల చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశం

ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అతడి శిక్షను <<18656174>>నిలిపివేస్తూ<<>> ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సీబీఐ అప్పీల్‌కు వెళ్లగా SC స్టే విధించింది. అతడిని విడుదల చేయవద్దని ఆదేశించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో <<18660112>>సెంగార్‌పై<<>> జీవితఖైదు అమల్లో ఉండనుంది.
News December 29, 2025
అమరావతిలో హైస్పీడ్, ట్రాఫిక్ ఫ్రీ రోడ్లు

AP: రాజధాని అమరావతిలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ట్రాఫిక్ జామ్‌కు తావులేకుండా విశాలమైన రహదారుల నిర్మాణం ఊపందుకుంది. 50-60 మీటర్ల వెడల్పుతో హైస్పీడ్ రోడ్లను నిర్మిస్తున్నారు. E11, E13, E15 రహదారులను NH-16తో అనుసంధానం చేస్తున్నారు. 9 వరుసల సీడ్ యాక్సెస్ రోడ్డు(E-3) ద్వారా అమరావతికి సులభంగా చేరుకోవచ్చు. రోడ్ల కింద డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ లైన్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.


