News February 8, 2025
బుగ్గారం: ట్రాక్టర్ ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు
ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో దంపతులు తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో బుగ్గారం మండలం వెల్గొండ గ్రామానికి చెందిన అక్కల సునీత, శేఖర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 8, 2025
అన్నమయ్య జిల్లా కంది రైతులకు అలర్ట్
ఈనెల 10 నుంచి జిల్లాలో కందులు అమ్మే రైతులందరూ రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ శుక్రవారం తెలిపారు. కందులు సాగు చేసే రైతులు నష్టపోకుండా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టి క్వింటాకు మద్దతు ధర రూ.7550 ప్రకటించడమైనదన్నారు. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ కమిటీ అధికారి త్యాగరాజు, వ్యవసాయ అధికారి చంద్రలతో తీసుకోవాల్సిన చర్యలపై జేసీ సమీక్షించారు.
News February 8, 2025
అనంతపురం జిల్లా మహిళలకు గుడ్‌న్యూస్
అనంతపురం జిల్లాలోని మహిళలకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. ఈ నెల 28వ తేదీ నుంచి మహిళలకు కుట్టు మెషీన్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జిల్లా మహిళలకు శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ వద్ద ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News February 8, 2025
నంద్యాల జిల్లా ఎస్పీ కీలక సూచన
వాలంటైన్స్ డే సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రజలకు కీలక సూచన చేశారు. ఆఫర్స్ పేరుతో వచ్చే బహుమతులపై జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ మోసగాళ్లు వాలెంటైన్స్ డే కోసం బహుతులు అంటూ నకిలీ లింకులు పంపిస్తారని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తెలియని లింకులు క్లిక్ చేయొద్దని అన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.