News December 17, 2025
బుచ్చిలో మహిళ ఆత్మహత్యాయత్నం

చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుచ్చిలోని చెన్నూర్ రోడ్డులో మంగళవారం జరిగింది. మహందాపురానికి చెందిన శ్రీను నెల్లూరుకు చెందిన భార్గవిని 2ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది పాప ఉంది. ప్రస్తుతం ఆ మహిళ రెండు నెలల గర్భవతి. భర్తని హోటల్లో భోజనం తెమ్మని, భర్త వచ్చేలోపు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త గమనించి రక్షించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించాడు.
Similar News
News December 20, 2025
కాకాణి మైనింగ్ కేసు… A2 శివారెడ్డికి రిమాండ్

మాజీమంత్రి కాకాణి అక్రమ మైనింగ్ కేసులో A2గా ఉన్న శివారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ అడ్డుకున్న గిరిజనులను బెదిరించాడన్న ఆరోపణల కేసులో ముద్దాయిగా చేర్చడంతో.. 10 నెలలుగా పరారీలో ఉన్నారు. అతడిని తాజాగా అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం గూడూరు మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. న్యాయ స్థానం ఆయనకు జనవరి 2 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది.
News December 20, 2025
నెల్లూరు: మాతృవేదన.. తీరేనా.!

నెల్లూరు జిల్లాలో హైరిస్క్ గర్భిణుల మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 44,536 మంది గర్భిణుల్లో రక్తహీనత, బీపీ వంటి సమస్యలతో 6,235 మందిని ‘హైరిస్క్’గా గుర్తించారు. వీరిపై నిరంతర పర్యవేక్షణ కొరవడటంతో మరణాలు ఆగడంలేదు. నాలుగేళ్లలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. ఈ ఏడాది ఇప్పటికే నలుగురు మృతి చెందారు. జిల్లాలో మెటర్నల్ మోర్టాలిటీ రేటు 19గా నమోదైంది. వైద్యశాఖ దృష్టిసారిస్తేనే ఈ ముప్పును నివారించగలరు.
News December 20, 2025
నెల్లూరు: వైసీపీలోనే ఆ ముగ్గురు..!

TDPకి షాక్ ఇచ్చిన నలుగురు కార్పోరేటర్లలో ముగ్గురు కార్పొరేటర్లు వైసీపీలోనే కొనసాగనున్నారు. మాజీ మంత్రి అనిల్ ఆధ్వర్యంలో మద్దినేని మస్తానమ్మ, కాయల సాహిత్య, వేనాటి శ్రీకాంత్‌రెడ్డిలు YS జగన్‌ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా శుక్రవారం సిటీ ఇన్‌ఛార్జ్ చంద్రశేఖర్‌రెడ్డిని సిటీ ఆఫీసులో కలిశారు. వైసీపీతోనే తమ పయనం సాగుతుందని TDPలో తమకు ఎటువంటి విలువ లేకుండా పోయిందని తెలిపారు.


