News July 7, 2025
బుట్టాయిగూడెం : ఐటీడీఏ పీవోకు వినతి ఇచ్చిన గిరిజన నేతలు

బుట్టాయిగూడెం మండలం కేఆర్ పురంలో ఐటీడీఏ పీఓ రాముల నాయక్‌ను టీ నర్సాపురం మండల బంజారా బజరంగీభేరి కమిటీ నాయకులు సోమవారం కలిశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. గిరిజన నాయకులు మాట్లాడుతూ టీ నర్సాపురం మండలంలోని గిరిజన తండాల్లో మౌలిక వసతులను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, ఇస్లావత్ ప్రేమ్ చంద్, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
Similar News
News July 7, 2025
HYD: యుద్ధం ప్రకటించిన సందర్భం అది: సీఎం

టీపీసీసీ చీఫ్‌గా ఎన్నికైన సందర్భాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. ‘నియంతృత్వాన్ని సవాల్ చేసి.. నిర్భందాన్ని ప్రశ్నించి, స్వేచ్ఛ కోసం యుద్ధం ప్రకటించిన సందర్భం అది. నేటి ప్రజాపాలనకు నాడు సంతకం చేసిన సంకల్పం. సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ అండతో టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జూలై 7ను జీవితంలో మరచిపోలేనని సీఎం రేవంత్ రెడ్డి Xలో ట్వీట్ చేశారు.

వరంగల్ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

వరంగల్ జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. సంగెం 6.8, నెక్కొండ 12.8, నల్లబెల్లి 34.0, వరంగల్ 10.3, గీసుకొండ 6.3, పర్వతగిరి 6.3, వర్ధన్నపేట 11.3, ఖానాపూర్ 18.3, చెన్నారావుపేట 10.0, దుగ్గొండి 41.8, రాయపర్తి 4.0, నర్సంపేట 18.0, మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు.