News October 31, 2024
బుడమేరు వరద నివారణకు డీపీఆర్ సిద్ధం చేయండి: సీఎం
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బుడమేరు వరద నివారణకు డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు బుధవారం ఆదేశించారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, కలెక్టర్ నిధి మీనా తదితర అధికారులతో సీఎం బుధవారం ఈ అంశంపై అమరావతి సచివాలయంలో సమావేశమయ్యారు. వరదల్లో నష్టపోయిన వాహనదారుల బీమా చెల్లింపులను 15 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలని సీఎం ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
Similar News
News October 31, 2024
ప్రయాణికుల రద్దీ మేరకు తిరుపతికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC), తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 3 నుంచి 24 వరకు ప్రతి ఆదివారం TPTY- SC(నం.07481), నవంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం SC- TPTY(నం.07482) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News October 31, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ (Y20 నుంచి Y22 బ్యాచ్‌లు) సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 4లోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. నవంబర్ 26 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తామని, ఫీజు వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.
News October 31, 2024
విజయవాడ మహిళకు TTDలో కీలక పదవి
విజయవాడకు చెందిన అనుగోలు రంగశ్రీని టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాగా ఆమె జనసేన పార్టీ కోశాధికారి AV రత్నం సతీమణి. కాగా రంగశ్రీ పలు ఆలయాలకు విరాళాలు ఇవ్వడంతో పాటు అనేక ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమల పవిత్రతను సంరక్షించడమే సంకల్పంగా ఆమెకు టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించామన్నారు.