News April 8, 2025
బుద్ధవనాన్ని సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీదారులు

బుద్ధపూర్ణిమ సందర్భంగా మే 12న నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మిస్ వరల్డ్ పోటీ దారుల రాక ఏర్పాట్లపై సోమవారం తన ఛాంబర్‌లో పర్యాటక, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసియా దేశాలకు చెందిన 30 మంది ప్రపంచ సుందరి పోటీదారులు రానున్నారు.
Similar News
News April 8, 2025
నల్గొండ జిల్లాలో 40 డిగ్రీల దాటిన ఎండ !

నల్లగొండ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం 40.01 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
News April 8, 2025
NLG: వైద్య ఆరోగ్యశాఖలో అద్దె వాహనాలకు ఆహ్వానం

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యం లో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌కు జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించేందుకు ట్యాక్స్ ప్లేట్ కలిగిన అద్దె వాహనాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలకు https://nalgonda.telangana. gov.in వెబ్సైట్స్ ను పరిశీలించాలని సూచించారు.
News April 8, 2025
MGUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 39 మంజూరు పోస్టులకు గాను 29 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 10 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు.